గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం విఫలం
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం విఫలం

శ్రీరంగాపురంక్యాంపులో మిరపపంటను పరిశీలిస్తున్న

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, నాయకులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: అన్నదాతలు చెమటోడ్చి పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు కొండాపురం కేశవరెడ్డి విమర్శించారు. బుధవారం మండలంలోని లింగదహాళ్‌, శ్రీరంగాపురం క్యాంపులోని ఉల్లి, మిరప, టమోటా పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధరలేక కూలీల ఖర్చులు భరించలేక పొలాల్లోనే వదిలేశారన్నారు. ఆర్బీకేలు బోగస్‌ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ధరల స్థిరీకరణకు బడ్జెట్‌లో రూ.3,500 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పుకొంటున్న జగన్‌ ప్రభుత్వం రెండేళ్లు దాటినా ఒక్క రైతును కూడా ఆదుకోలేదన్నారు. బండూరు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లుల మంజూరులో రాజకీయం చేస్తున్నారన్నారు. మిరప పంటకు ఎకరాకి రూ.లక్ష పెట్టుబడి పెడితే పచ్చిమిరపకాయలు కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలకు అమ్మితే అప్పులు ఎలా చెల్లించాలో దిక్కుతోచటంలేదని, రైతు హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌, రాయదుర్గం గ్రామీణం తెదేపా మండల కన్వీనర్లు బలరామిరెడ్డి, హనుమంతురెడ్డి, బలరామ్‌, నాయకులు చలపతి, కొత్తపల్లి తిమ్మరాజు, తిప్పేస్వామి, మల్లికార్జున, మోహన్‌, ధనుంజయ, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని