ఓటర్ల సవరణ జాబితాపై ప్రత్యేక శ్రద్ధ
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

ఓటర్ల సవరణ జాబితాపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా కార్యక్రమాన్ని సజావుగా, పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర చీఫ్‌ ఎలెక్టోరల్‌ అధికారి విజయానంద్‌ వీక్షణ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అభ్యంతరాలను కేటాయించిన సమయంలో పరిష్కరించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వివరించారు. వీసీలో జేసీ నిశాంత్‌కుమార్‌, ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్‌ భాస్కర్‌, అమరావతి-అనంత ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రత్యేక ఉప కలెక్టర్‌ శివయ్య, ఎస్‌డీసీ శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌ఓ నీలయ్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని