ఉపాధి బిల్లుల జాప్యంపై వైకాపా నాయకుల ఆగ్రహం
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

ఉపాధి బిల్లుల జాప్యంపై వైకాపా నాయకుల ఆగ్రహం

రొద్దం, న్యూస్‌టుడే: ఉపాధి బిల్లుల చెల్లింపులో అధికారుల తీరుపై అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చెక్కులపై సర్పంచుల సంతకాలు తీసుకోకుండా రెండు రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారని అధికారుల తీరుపై వైకాపా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. రొద్దం మండలంలోని బూచెర్ల, ఆర్‌లోచెర్ల, బొక్సంపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు, వైకాపా నాయకులు అక్కులప్ప, సి.నారాయణరెడ్డి, ఎన్‌.నారాయణరెడ్డి, పలువురు కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్దనే నిరీక్షించారు. అధికారుల తీరును నిరసిస్తూ.. రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పెనుకొండ ఎస్సై రమేశ్‌ బాబు రొద్దం ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకొని వైకాపా నాయకులతో చర్చించారు. రూ.1.49 కోట్ల బిల్లులు విషయంపై డీపీవోకు చరవాణి ద్వారా వైకాపా నాయకులు అక్కులప్ప, నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు ఆమె స్పందించి డీఎల్‌పీవోతో చర్చించినట్లు తెలిసింది. వెంటనే బిల్లులకు సంబంధించిన చెక్కులతో పాటు నివేదికను మండల అధికారులు డీఎల్‌పీవో వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని