కాంగ్రెస్‌ హయాంలోనే తాడిపత్రి అభివృద్ధి
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

కాంగ్రెస్‌ హయాంలోనే తాడిపత్రి అభివృద్ధి

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే తాడిపత్రి అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. తాడిపత్రి పట్టణంలోని బండా మసీదు వద్ద కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో జీవించాలన్నా ప్రజలు పన్నులు కట్టాల్సిన దుస్థితి వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పన్నుల విధానాలు తీసుకొచ్చి పేద ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నాయని అన్నారు. ప్రధానంగా అనంతపురం జిల్లా అభివృద్ధిలో అట్టడుగులోకి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి, డీసీసీ ప్రతాప్‌రెడ్డి, నాయకులు రామానాయుడు, భాస్కర్‌రెడ్డి, ఓబిరెడ్డి, ఫకృద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని