తెదేపా కార్యకర్తపై హత్యాయత్నం
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

తెదేపా కార్యకర్తపై హత్యాయత్నం

చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్‌

మలకాపురం(రాయదుర్గం గ్రామీణం), న్యూస్‌టుడే: రాయదుర్గం మండలంలో తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. మలకాపురానికి చెందిన తెదేపా కార్యకర్త రమేష్‌ బావ గోపాల్‌ను అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త శ్రీనివాసులు హత్య చేశాడు. ఇటీవల ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటినుంచి గోపాల్‌ హత్య కేసులో ప్రధానసాక్షి అయిన రమేష్‌ను బెదిరించేవాడు. మంగళవారం మధ్యాహ్నం గ్రామంలో రమేష్‌, శ్రీనివాసులు గొడవపడ్డారు. రాత్రి కృష్ణమూర్తి, తిప్పేశితో కలిసి శ్రీనివాసులు కర్రలు, రాళ్లతో రమేష్‌, ఆయన చెల్లెలు రేణుకమ్మపై దాడి చేయగా గ్రామంలో ఇరుగుపొరుగు గమనించటంతో పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌, రేణుకమ్మను బంధువులు కళ్యాణదుర్గం తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం తరలించారు. శ్రీనివాసులు, కృష్ణమూర్తి, తిప్పేశిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం సీఐ సురేష్‌బాబు తెలిపారు.

బాధిత కుటుంబీకులకు కాలవ పరామర్శ... తెదేపా కార్యకర్త రమేష్‌ కుటుంబీకులను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు బుధవారం పరామర్శించారు. దాడి ఎలా జరిగిందో రమేష్‌ తల్లి గోవిందమ్మను అడిగి తెలుసుకున్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు అధికారం ఉంది కదా అని దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని