అప్పులబాధతో రైతు ఆత్మహత్య
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

పురుషోత్తం (పాతచిత్రం)

బెళుగుప్ప, న్యూస్‌టుడే: అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళుగుప్పలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాలు మేరకు.. పురుషోత్తం(33) గ్రామంలో పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారు. నాలుగేళ్లుగా పంటల్లో నష్టం రావటంతో సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు మిగిలాయి. వాటిని ఎలా తీర్చాలని తరచూ మనోవేదనకు గురయ్యేవారు. మంగళవారం రాత్రి గ్రామ సమీపంలో విషపుగుళికలు మింగారు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో చికిత్సకోసం అనంతపురం ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రుషేంద్రబాబు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని