తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ

కేసు నమోదు చేసుకుంటున్న పోలీసులు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని చదం గొల్లలదొడ్డి గ్రామంలో తెదేపా నాయకుడు, పంచాయతీ సర్పంచి మల్లేశప్ప, వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి ఎర్రెప్ప వర్గీయుల నడుమ బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. మారెమ్మ ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆయా గ్రామాలకు వెళ్లి తెదేపా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చదం గొల్లలదొడ్డిలో సర్పంచి మల్లేశప్ప ఇంటికెళ్లి చర్చలు జరిపారు. ఆయన వెళ్లిన అనంతరం వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి వర్గీయులు మల్లేశప్ప ఇంటి వద్దకు వెళ్లి కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఘర్షణలో గర్భిణీ అయిన సర్పంచి కూతురు యశోదమ్మ, బంధువులు చామండమ్మ, కస్తూరప్ప గాయపడగా, వైకాపా నాయకుడు ఎర్రెప్ప కూడా గాయాలపాలయ్యాడు. రాయదుర్గం సీఐ సురేష్‌కుమార్‌ పోలీసులతో ఘటనాస్థలానికి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని