టమోటా మండీలో అగ్నిప్రమాదం
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

టమోటా మండీలో అగ్నిప్రమాదం

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగర సమీపంలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లోని ఓ మండీలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదనపు జిల్లా అగ్నిమాపక అధికారి అశ్వర్థ తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌ఆర్‌ మండీలో ఉన్నఫళంగా మంటలు వ్యాపించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రెండువేల టమోటా ప్లాస్టిక్‌ పెట్టెలు దగ్ధమయ్యాయి. అగ్నికీలలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సుమారు రూ.రెండు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు మండీ యజమాని రమణప్ప తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది నాగేశ్వరరావు, పెంచలయ్య, శివన్న, జయరాముడు, రవికుమార్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని