రైళ్లలో నేరాలు జరగకుండా అప్రమత్తమవుదాం
eenadu telugu news
Updated : 14/10/2021 05:24 IST

రైళ్లలో నేరాలు జరగకుండా అప్రమత్తమవుదాం

మాట్లాడుతున్న రైల్వే ఐజీ ఈశ్వర్‌రావ్‌

గుంతకల్లు, న్యూస్‌టుడే: రైళ్లలో నేరాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సికింద్రాబాద్‌ జోన్‌ రైల్వే రక్షణదళం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఈశ్వర్‌రావ్‌ అన్నారు. ఆయన బుధవారం గుంతకల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే అధికారుల రిక్రియేషన్‌ కేంద్రంలో ఏర్పాటుచేసిన డివిజన్‌ రక్షణదళం సిబ్బంది సమావేశంలో మాట్లాడారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో రైల్వేలో తిరిగి పెద్దసంఖ్యలో రైళ్లను నడిపే అవకాశం ఉన్నందున చోరీలు జరగకుండా పటిష్ఠంగా విధులు నిర్వహించాలన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. రైళ్లలో ప్రయాణికులు నిర్భయంగా ప్రయాణించేలా చూడాల్సిన బాధ్యత రక్షణదళం పోలీసులు, అధికారులపై ఉందన్నారు. సిబ్బంది సంక్షేమాన్ని చర్చించడానికి సురక్షా సమ్మేళనాన్ని నిర్వహించారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని అన్నారు. సెక్యూరిటీ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై రికార్డులను తనిఖీ చేశారు. సెక్యూరిటీ కమిషనర్‌ మురళీకృష్ణ, సహాయ కమిషనర్‌ అనూజ్‌ కుమార్‌, సీఐ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని