భూముల రీసర్వే పూర్తి చేయండి
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

భూముల రీసర్వే పూర్తి చేయండి


కొత్తపల్లిలో రీసర్వే చేసి నాటిన సరిహద్దు రాయిని పరిశీలిస్తున్న
కలెక్టర్‌ నాగలక్ష్మి, పక్కన జేసీ సిరి, సబ్‌ కలెక్టర్‌ నవీన్‌ తదితరులు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపల్లిలో భూముల రీసర్వే పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంయుక్త కలెక్టర్‌ సిరి, సబ్‌ కలెక్టర్‌ నవీన్, డీపీవో పార్వతి, జడ్పీ సీఈవో భాస్కర్‌రెడ్డి తదితరులతో కలసి కొత్తపల్లిలో రీసర్వే పనుల తీరును కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వ, పట్టా, పెండింగ్‌ భూముల రీసర్వేపై శ్రద్ధ చూపాలన్నారు.  డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డివిజినల్‌ సర్వే అధికారి చిట్టిబాబు, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
మార్పు కనిపించేలా పని చేయాలి..
గ్రామాలు, ప్రజల్లో మార్పు కనిపించేలా సచివాలయాల సిబ్బంది పని చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె పందిపర్తి, చాలకూరు గ్రామాల సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, పథకాల గోడ పత్రాల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది, వాలంటీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పందిపర్తి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని, పోషకాహారం నాణ్యతా తీరును విద్యార్థులతో అడిగి తెలుసుకొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని