దారి శిథిలం.. కాస్త భద్రం
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

దారి శిథిలం.. కాస్త భద్రం


ఎస్కేయూ ముఖద్వారం వద్ద శిథిలమైన కల్వర్టు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ముఖద్వారం ఎదురుగానే ప్రమాదం పొంచిఉంది. జాతీయ రహదారులశాఖ నాలుగు వరుసల రహదారి నిర్మించారు. రహదారికి ఇరువైపులా సిమెంట్‌ కాలువ నిర్మించారు. ముఖద్వారం ఎదురుగా ఉన్న కాలువపై ఉన్న కల్వర్టు శిథిలమైంది. ఇటీవల ట్రాక్టరు చక్రాలు అందులో ఇరుక్కుపోయాయి. ప్రమాదమైతే తప్పింది. కానీ అటువైపు యూనియన్‌బ్యాంకు, మహిళా వసతిగృహాలు, ఏటీఎం, ఆచార్యులు నివాసగృహాలు ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదమరచినా ప్రమాదం తప్పదు. రాత్రిళ్లు మరింత అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఎస్కేయూ అధికారులు స్పందించి, ఈ కల్వర్టు మరమ్మతు చేయాలని పలువురు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని