ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కుట్రలు
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కుట్రలు


మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే తెదేపా కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట శుక్రవారం జనాగ్రహదీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ తలారి రంగయ్య, నగర మేయర్‌ వసీం, ఉప మేయర్లు వాసంతిసాహిత్య, కొగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్టు యార్డు ఛైర్మన్‌ ఫయాజ్‌లు హాజరయ్యారు. అనంతరం ఉప మేయర్‌ వాసంతి సాహిత్య రోడ్లపై చీపుర్లతో ఊడ్చి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాగే పరశురాం, నాయకులు అనంత చంద్రారెడ్డి, చింతా సోమశేఖరరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, గోపాల్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని