జూడో ఛాంపియన్‌గా చిగిచెర్ల జడ్పీ పాఠశాల
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

జూడో ఛాంపియన్‌గా చిగిచెర్ల జడ్పీ పాఠశాల


కప్పు అందుకుంటున్న విజేతలు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా సబ్‌జూనియర్‌, క్యాడెట్‌ విభాగాల జూడో ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను చిగిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాల సొంతం చేసుకుంది. శుక్రవారం ఆర్డీటీ జూడో అకాడమీ జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పతకాలు చేజిక్కించుకున్నారు. రెండో స్థానంలో తాడిమర్రి కస్తూర్బా పాఠశాల జట్టు, మూడోస్థానంలో కె.నరసాపురం జడ్పీ ఉన్నత పాఠశాల జట్టు నిలిచింది. ప్రథమస్థానంలో నిఖిత, హేమశ్రీ, కుసుమ, శైలజ, పవిత్ర, శృతి, హర్షిత, యశస్విని, జ్యోత్స్న, మైథిలి నిలిచారు. వరుసగా తొలి మూడుస్థానాల్లో సాధించిన వారికి ట్రోఫీలు, పతకాలు అందజేశారు. శ్రీశైలం దేవస్థానం మాజీ ఈఓ రామారావు, ఎస్కేయూ ఆచార్యులు రాంగోపాల్‌, ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, జూడో సంఘం జిల్లా కార్యదర్శి విఠల్‌, సీఈఓ బాబు తదితరులు హాజరై విజేతలకు పతకాలు, యోగ్యత పత్రాలు ప్రదానం చేశారు. రెండు రోజులుగా జరిగిన జూడో పోటీలు శుక్రవారం ముగిశాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని