గదుల కొరత.. విద్యార్థుల వెత
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

గదుల కొరత.. విద్యార్థుల వెత


పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జడ్పీ సెంట్రల్‌ ఉన్నత పాఠశాలలో 175 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో బోధన జరుగుతోంది. పాఠశాలలో తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలలో అసంపూర్తి భవనంతో పాటు 10 తరగతి గదులున్నాయి. వీటిలో వీసీఆర్, డీసీఆర్‌ కోసం 2 గదులు, కార్యాలయం, స్టాఫ్‌రూం, రెండు గదుల్లో స్టోర్‌రూం, మిగిలిన నాలుగు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. గదుల కొరత కారణంగా పాఠశాల ఆవరణలోని మూతబడిన హాస్టల్‌ గదిని తరగతి గదిగా వినియోగిస్తున్నారు. ఒకే గదిలో ఆంగ్లమాధ్యమం, తెలుగు మాధ్యమాన్ని బోధిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనంలో కిందిభాగంలో రెండు గదులున్నాయి. పై అంతస్తులో తరగతి గది నిర్మించినప్పటికీ మెట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఆ గది నిరూపయోగంగా మారింది. పాఠశాల ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలు, కంపచెట్లతో నిండిపోయింది. వాటి నడుమ తరగతిగది నిర్వహించలేక ఉన్న గదిని స్టోరూంగా మార్చారు. భవిషత్తు ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5వ తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలకు అనుసంధానం చేస్తే.. వారి సంఖ్య పెరుగుతుంది. అదనపు గదులు అవసరమవుతాయి. సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


మూతపడిన హాస్టల్‌ గదిలో విద్యార్థులకు బోధన

రెండు రోజుల్లో శుభ్రం చేయిస్తాం
పాఠశాలలో ఆవరణను రెండు రోజుల్లో శుభ్రం చేయిస్తాం. నూతన తరగతి గదులకోసం నాడునేడులో ప్రతిపాదనలు పంపించి గదుల కొరతను అధిగమిస్తాం. - కవిత, ప్రధానోపాధ్యాయిని 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని