తెదేపా విజయానికి సమష్టి కృషి చేద్దాం
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

తెదేపా విజయానికి సమష్టి కృషి చేద్దాం


నాయకులతో హిందూపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి

పెనుకొండ, న్యూస్‌టుడే: పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలకు త్వరలో ప్రకటన రానుందని, తెదేపా పక్షాన పోటీ చేసే అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండలోని ఆయన ఇంట్లో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బీకే మాట్లాడుతూ నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయని, సమర్థులైన వారినే ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి నలుగురు పోటీపడగా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. పార్టీ నాయకులు జీవీపీ నాయుడు, వెంకట్రాముడు, మాధవనాయుడు, కేశవయ్య, ఫారూక్, రామకిష్టప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని