అభివృద్ధి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

అభివృద్ధి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు


కళ్యాణదుర్గం గ్రామీణం: జనాగ్రహదీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉషా

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారం లేకపోవడంతో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఉషా తెలిపారు. శుక్రవారం టీకూడలిలో జనాగ్రహ దీక్షకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జోలికి వస్తే అభిమానులు ఊరుకోరన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్నారని, దానిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు. తెదేపా అధినేతలానే నియోజకవర్గస్థాయి నాయకులు గ్రామాలకు వచ్చి అభివృద్ధి, ప్రజలకు అందిన పథకాలు తెలుసుకోలేకపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు, మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌చైర్మన్లు, నియోజకవర్గంలోని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాయదుర్గం పట్టణం: ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఆపాలని ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జనాగ్రహ దీక్షలో భాగంగా వినాయక సర్కిల్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని, మంచి, చెడు గమనించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెదేపా నాయకులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌ కాపు భారతి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శిల్ప, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉరవకొండ గ్రామీణం: ముఖ్యమంత్రిపై తెదేపా నాయకుల అనుచిత వ్యాఖ్యలు సబబుకాదని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. జనాగ్రహ దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని