మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నేడు
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నేడు


సభ్యుల కోసం ఏర్పాటు చేసిన కొత్తకుర్చీలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఛైర్‌పర్సన్‌ పొరాళు శిల్ప ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ కౌన్సిల్‌హాలులో జరిగే సమావేశానికి వైస్‌ ఛైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరారు. ప్రతినెలా చివరివారంలో జరిగే సమావేశాన్ని 1వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ముందుగా ముగిస్తున్నారు. అజెండాలో కేవలం 4 అంశాలు మాత్రమే ఉండటం విశేషం. ఒకటో వార్డు సచివాలయానికి మరుగుదొడ్లు, మరమ్మతులు, మూడు విద్యుత్తు మోటార్ల మరమ్మతులకు అవసరమైన నిధుల మంజూరు కోసం సమావేశం నిర్వహిస్తున్నారు.
పాతవి బాగున్నా...
రాయదుర్గం మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులకు కొత్త కుర్చీలు వచ్చాయి. పట్టణంలో పైపులైన్ల మరమ్మతులకు నిధులు లేవంటున్న మున్సిపల్‌ అధికారులు ప్రజాధనాన్ని వెచ్చించి కౌన్సిల్‌ సభ్యులకు మాత్రం రూ.2లక్షలతో కొత్త కుర్చీలు తెప్పించారు. పాతవి బాగున్నా కొత్తవి తెప్పించటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ కార్యాలయానికి రంగులు వేసేందుకు అధికారులు టెండర్లు పిలవగా బిల్లులు సకాలంలో ఇస్తారో లేదోనని టెండర్లు వేయటానికి ఎవరూ ముందుకు రాకపోవటం గమనార్హం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని