బస్సు సర్వీసులు పెంచాలంటూ ధర్నా
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

బస్సు సర్వీసులు పెంచాలంటూ ధర్నా


మేనేజర్‌కు వినతిపత్రం ఇస్తున్న విద్యార్థులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని కోరుతూ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు గురువారం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేశారు. మారెంపల్లి, డి.కొండాపురం, కాశీపురం, కదరంపల్లి, ఆవులదట్ల, దేవరెడ్డిపల్లి క్రాస్, బొమ్మక్కపల్లి, వడ్రహొన్నూర్‌ తదితర గ్రామాలకు ఒకే బస్సు నడుపుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి కొట్రేశ్‌ తెలిపారు. నిత్యం టాపుపై ప్రయాణించాల్సి వస్తోందన్నారు. బొమ్మనహాళ్‌ మండలం చంద్రగిరి, సిద్ధరాంపురం, కురవళ్ళి గ్రామాలకు చెందిన 70 మంది విద్యార్థులు బస్సులేక నిత్యం నడుచుకుంటూ మండలకేంద్రానికి వెళుతున్నారన్నారు. అనంతరం డిపో మేనేజర్‌ సురేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఫెడరేషన్‌ ప్రతినిధులు వంశీ, శివ, తరుణ్, అంజి, అరుణ్, మహేష్, అభి, వంశీ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని