నాణ్యమైన విత్తనం అందిస్తాం
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

నాణ్యమైన విత్తనం అందిస్తాం


రైతులతో మాట్లాడుతున్న ఏపీసీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు

కణేకల్లు, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలోనే రైతులు పండించిన నాణ్యమైన పప్పుశనగ సేకరించి తిరిగి రైతులకు రాయితీ ధరకు అందించడమే రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ప్రధాన ధ్యేయమని ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్‌.హనుమాపురం ఆర్బీకేలో విత్తన పప్పుశనగ పంపిణీని పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. జిల్లాలో 25వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తన పప్పుశనగ విత్తన సేకరణ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సంఘాలు ఏర్పాటు చేసుకొని ముందుకొస్తే రాయితీ ధరకు మూలవిత్తనం అందిస్తామని చెప్పారు. పండించిన పప్పుశనగను నాణ్యమైన విత్తనంగా ధృవీకరించి గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఆర్బీకేల ద్వారా రాయితీ ధరకు తిరిగి పంపిణీ చేస్తామని వివరించారు. ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజరు ధనలక్ష్మి, సహాయ మేనేజరు విజయలక్ష్మీ, ఏఓ శ్రావణ్‌కుమార్, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ లక్ష్మీకాంతరెడ్డి, సర్పంచి జయరామ్, ఎంపీటీసీ నరేంద్రబాబు, సొసైటీ అధ్యక్షుడు తిమ్మప్ప, మాజీ ఎంపీపీ రాజ్‌గోపాల్‌రెడ్డి, కార్డ్‌ ఏజెన్సీ నిర్వాహకులు నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని