శాస్త్రీయ దృక్పథంతో జల వినియోగం
eenadu telugu news
Published : 23/10/2021 06:20 IST

శాస్త్రీయ దృక్పథంతో జల వినియోగం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: భవిష్యత్తులో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు భూగర్భ జల వినియోగంలో శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్సులో భూగర్భ జలవనరుల శాఖ ప్రత్యేక సమీక్ష జరిగింది. ఆక్విఫర్‌ మ్యాప్స్‌-మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించారు. భూగర్భ జలబోర్డు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. భూగర్భ జల మట్టాన్ని పెంచే పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని, మండలాల వారీగా ప్రణాళికలు తయారీ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జేసీ నిశాంత్‌కుమార్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ తిప్పేస్వామి, జలవనరుల బోర్డు శాస్త్రవేత్త గుమ్మ రవికుమార్, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, పండ్లతోటల డీడీ పద్మలత, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. 


సర్వజనలో కంటి శస్త్ర చికిత్సలు
అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కంటికి లేజర్‌ శస్త్రచికిత్సలు ప్రారంభించారు. శుక్రవారం కంటి విభాగం వైద్యుడు భానుమూర్తి ఇద్దరికి ఫ్యాకో లేజర్‌ కంటి శస్త్రచికిత్సలు చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన గీత, నార్పలకు చెందిన నారాయణస్వామికి నూతన శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ జగన్నాథం, ఉప ఆర్‌ఎంవోలు విజయమ్మ, వైవీరావు వైద్యులను అభినందించారు. కంటి విభాగాధిపతి డాక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్‌ సైదన్నతో పాటు డాక్టర్‌ భానుమూర్తిని సన్మానించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని