close

ఆదివారం, జూన్ 07, 2020

తాజా వార్తలు

తండ్రి మందలించాడని యువతి ఆత్మహత్య

ములకలపల్లి, న్యూస్‌టుడే: తండ్రి మందలించాడని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములకలపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓయువతి(21) ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి గురువారం రాత్రి వచ్చాడు. దీనిని గమనించిన యువతి తండ్రి ఇరువురినీ మందలించాడు. మనస్తాపానికి గురైన యువతి అర్ధరాత్రి పురగులమందు తాగింది. కుటుంబ సభ్యులు యువతిని హుటాహుటిన ములకలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.


ఉరివేసుకొని వ్యక్తి..

ముదిగొండ, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జరాసంగమ్‌ మండలం తుమ్మాన్‌పల్లికి చెందిన నవాజ్‌రెడ్డి(31) పదేళ్ల క్రితం ముదిగొండ వచ్చి గ్రానైట్‌ పరిశ్రమలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఏడాదిగా పనులు దొరకక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పనికి వెళుతున్నాని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన నవాజ్‌రెడ్డి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు దొరకక, అప్పులు పుట్టక తన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

కల్లూరు, న్యూస్‌టుడే: కల్లూరులోని కప్పలబంధం రోడ్డులో రామడుగు శ్రీకాంత్‌(30) బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినా ఫలితం లభించలేదు. శుక్రవారం గుడిలోని తేరుబావిలో మృతదేహం ఉందని స్థానికులు గుర్తించారు. మృతుని తండ్రి కోటాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.