close

బుధవారం, ఆగస్టు 05, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాస్త ఊరట!

తగ్గిన వైరస్‌ ఉద్ధృతి

 

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: జిల్లాలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 51 కేసులు నమోదయ్యాయి. వివరాలు ఇలా.. తిరుపతి నగరం 14, నగరి 9, మదనపల్లె 5, తిరుపతి గ్రామీణ 4, పెద్దపంజాణి, పుత్తూరులో రెండేసి, పీలేరు, కురబలకోట, ఏర్పేడు, వరదయ్యపాళెం, వడమాలపేట, రామచంద్రాపురం, గుడిపాల, ములకలచెరువు, నారాయణవనం, రామసముద్రం, పీటీఎం మండలాల్లో ఒక్కో కేసు, ఇతర రాష్ట్రాల మూలాలతో మూడు, ఇతర జిల్లా మూలాలతో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. పెద్దపంజాణి మండలంలో ఒకే కుటుంబంలో నాలుగేళ్ల, ఆరేళ్ల చిన్నారులకు, తిరుపతిలో ఏడాది శిశువు, ఏర్పేడులో రెండేళ్ల చిన్నారిలో లక్షణాలు బయటపడ్డాయి. తిరుపతిలో 97 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్‌గా తేలింది.

రాత్రికి మరో 38 కేసులు : గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 38 కేసులు వెలుగుచూశాయి. నగరి 7, తిరుపతి గ్రామీణ 6, చిత్తూరు నగరం 5, తిరుపతి అర్బన్‌ 4, శ్రీకాళహస్తి 3, వాల్మీకిపురం 2, కార్వేటినగరం, నిండ్ర, బంగారుపాళ్యం, జీడీ నెల్లూరు, గుడిపాల, పాలసముద్రం, సదుం, శాంతిపురం, సత్యవేడు, విజయపురం మండలాల్లో ఒక్కో కేసు, ఇతర జిల్లా మూలాలతో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. జిల్లాలో 1,706 మందికి కొవిడ్‌ సోకింది. తిరుపతిలోని నాలుగు కేసులతో కలుపుకొని ఇప్పటివరకు 299 మంది వైరస్‌ బారిన పడ్డారు.

కొవిడ్‌ వార్డులోని నర్సుకు పాజిటివ్‌ : చిత్తూరులోని జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా వైద్య సేవలందించిన ఓ నర్సుకు పాజిటివ్‌గా తేలింది. క్వారంటైన్‌లో ఉంచిన ఆమెకు పరీక్షలు చేయగా.. వైరస్‌ సోకినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

కరోనా సమాచారం

మొత్తం కేసులు 1,706

యాక్టివ్‌ 1,091

డిశ్ఛార్జి 606

మరణాలు 9

క్వారంటైన్‌లో 545

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

చంద్రబాబు సవాల్‌కు భయపడిన వైకాపా: నాని

తిరుపతి(నగరం): రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని మార్చడంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని మార్పు జరగలేదని, రాజకీయ దురుద్దేశంతోనే మూడు రాజధానులు తెరపైకి వచ్చాయని విమర్శించారు. సీఎం జగన్‌ రాజధాని విషయంలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌కు వైకాపా భయపడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు అన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.