
3,484 పాజిటివ్ కేసులు
తిరుపతిలో అత్యధికం
ఈనాడు డిజిటల్, చిత్తూరు: తిరుపతి నగరంలో కొవిడ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. సోమవారం రాత్రి 78 కేసులు నమోదు కాగా.. వీటితో కలిపి నగరంలో మొత్తం 1,092 మంది కరోనా బారిన పడ్డారు. తిరుపతి గ్రామీణలో ఈ సంఖ్య 191గా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 173 కేసులు నమోదయ్యాయి. తిరుపతి నగరం 90, తిరుపతి గ్రామీణ 14, నారాయణవనం 9, చిత్తూరు నగరం 8, శ్రీకాళహస్తి 7, చంద్రగిరి, మదనపల్లెలో అయిదేసి, రేణిగుంట, సదుం, పుత్తూరులో మూడేసి, వెదురుకుప్పం, బి.కొత్తకోట, ఐరాలలో రెండేసి, ఏర్పేడు, పూతలపట్టు, పాకాల, కేవీపల్లె, నగరి, పీలేరు, వడమాలపేట, వాల్మీకిపురం, ఎస్ఆర్పురం, పుంగనూరు, యాదమరి, పలమనేరులో ఒక్కొక్కరు, ఇతర జిల్లాల వాసులు ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. తిరుపతి నగరంలో నాలుగేళ్ల చిన్నారులిద్దరిలో లక్షణాలు బయటపడ్డాయి.
రాత్రికి 141 కేసులు
సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 141 కేసులు వెలుగు చూశాయి. తిరుపతి నగరం 78, శ్రీకాళహస్తి 26, పుత్తూరు 9, చిత్తూరు నగరం 7, ఏర్పేడు 4, తొట్టంబేడు, వడమాలపేటలో మూడేసి, మదనపల్లె, నగరిలో రెండు చొప్పున, నారాయణవనం, నిండ్ర, రేణిగుంట, విజయపురం మండలాల్లో ఒక్కొక్కరు, జిల్లాలో ఉపాధి కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల వాసులు ఇద్దరు, ఇతర జిల్లా వాసులు ఒకరు కొవిడ్ బారిన పడ్డారు. వీటితో కలిపి 3,484 మందికి ఇప్పటివరకు కొవిడ్ సోకింది.
రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రిలో ఐదుగురి మృతి
తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రి(స్విమ్స్)లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు ముగ్గురు కరోనా బాధితులు, ఇద్దరు అనుమానితులు మృతి చెందినట్లు స్విమ్స్ సంచాలకులు భూమా వెంగమ్మ పేర్కొన్నారు. రామకుప్పం మండలానికి వ్యక్తి(76), మదనపల్లెకు చెందిన మహిళ(67), చిత్తూరుకు చెందిన వ్యక్తి(75) కరోనా లక్షణాలతో మృతి చెందారు. అనుమానిత లక్షణాలతో తిరుపతికి చెందిన వ్యక్తి(75), నెత్తకుప్పంకు చెందిన యువకుడు(30) మరణించారు.
82 మంది డిశ్ఛార్జ్
తిరుపతి కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ సెంటర్ల నుంచి సోమవారం 82 మంది కరోనా బాధితులు డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రి(స్విమ్స్) నుంచి జిల్లాకు చెందిన 14 మంది, కడపకు చెందిన ఒక్కరు డిశ్ఛార్జ్ అయ్యారు. జిల్లా కొవిడ్ ఆస్పత్రి-2(రుయా) నుంచి 11 మంది, శ్రీనివాసం కొవిడ్ సెంటర్ నుంచి 56 మందిని ఇంటికి పంపారు.