Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విధులకు గైర్హాజరైతే సస్పెన్షన్‌

కలెక్టర్‌


అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

తిరుపతి(రెవెన్యూ), న్యూస్‌టుడే: కొవిడ్‌ సేవల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని, లేనిపక్షంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ మేరకు సస్పెన్షన్‌ ఉంటుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం కొవిడ్‌ కేర్‌ కేంద్రాల నోడల్‌ అధికారులు, వైద్యులతో, నగరపాలిక కమిషనర్‌ గిరీష, జేసీ వీరబ్రహ్మంతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. హరినారాయణన్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో అవసరమైన వైద్యులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తితిదే సహకారం, ప్రభుత్వ నిధులతో పాటు, భగవంతుని నిధులు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఎక్కడ కూడా వృథా కాకుండా చూడాలని, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో పడకలు లేవనే సమస్య రాకూడదని తెలిపారు. ప్రస్తుతం రుయాలో 450, స్విమ్స్‌లో 150, పద్మావతీ నిలయంలో 300, విష్ణునివాసంలో 300 వరకు ఉన్నాయని, శ్రీనివాసం, ఆయుర్వేద ఆస్పత్రి, ఈఎస్‌ఐ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. శ్రీపద్మావతీ నిలయంలో మంగళవారం ఉదయానికి 825 మంది, విష్ణు నివాసంలో 680 మంది పేషెంట్లు ఉన్నారని, వైద్యసేవల డ్యూటీ చార్టు మేరకు ప్రతిరోజు వైద్యులు సేవలు అందించాలని ఆదేశించారు. సమీక్షలో శ్రీపద్మావతి నిలయం ఇన్‌ఛార్జి లక్ష్మి, విష్ణునివాసం ఇన్‌ఛార్జి వెంకటరమణ, డీఎంహెచ్‌వో పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సరళమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని