Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలెక్టరేట్‌లో కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌

అందుబాటులో ఫోన్ నంబర్లు

 

చిత్తూరు(జిల్లా సచివాలయం): కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి నియంత్రణకు కలెక్టర్‌ హరినారాయణన్‌ సత్వర చర్యలు చేపట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో 24 గంటలు సేవలందించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పాజిటివ్‌ బాధితుల కాంటాక్టు ట్రేసింగ్‌, ఫీవర్‌ క్లినిక్‌, హోమ్‌ ఐసోలేషన్‌ మానిటరింగ్‌, హోమ్‌ క్వారంటైన్‌ మానిటరింగ్‌, శాంపుల్‌ కలెక్షన్‌ మానిటరింగ్‌ తదితర అంశాలపై వైద్య సిబ్బంది సేవలను అందించను న్నారు. కంట్రోల్‌ రూమ్‌లో ప్రతిరోజూ మూడు షిప్టులలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వైద్యాధికారులు విధులు నిర్వర్తిస్తారు. కంట్రోల్‌ రూమ్‌లోని 104, 9849902379, 08572-242732, 242734 నంబర్లకు ఫోన్‌ చేస్తే టెస్టింగ్‌, అడ్మిషన్లకు సంబంధించి సలహాలు, సూచనలు అందించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని