Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీఆర్‌సీ అమలుకు 22న మండల కేంద్రాల్లో ధర్నా

చిత్తూరు(విద్య): ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 11వ పీఆర్‌సీని అమలు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం యూటీఎఫ్‌ చిత్తూరు డివిజన్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2018 జులై ఒకటో తేదీ నుంచి పీఆర్‌సీని అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఈ నెల 22న పీఆర్‌సీ అమలు చేయాలంటూ మండల, తాలూకా కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని