Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైరస్‌ ఉద్ధృతి

ఈనాడు-తిరుపతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 1063 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఐదుగురు మహమ్మారితో మరణించారు. తిరుపతిలో అత్యధికంగా 273 మందికి వైరస్‌ సోకగా తిరుపతి(గ్రామీణ)లో 162 మంది ఉన్నారు. శ్రీకాళహస్తి 88, చిత్తూరు 50, మదనపల్లె 44, పీలేరు 43, రేణిగుంట 37, రామచంద్రాపురం 28, వడమాలపేట 19, పుత్తూరు 18, చంద్రగిరి 17, ఏర్పేడు 16, నగరి 14, కలికిరి, రొంపిచెర్లలో 13 చొప్పున, పాకాల, రామసముద్రంలో 12 వంతున, పలమనేరులో 11 కేసులు నమోదయ్యాయి. కుప్పం, పెద్దపంజాణిలో 9 వంతున, చిన్నగొట్టిగల్లు, చౌడేపల్లి, గుడుపల్లె, గుర్రంకొండ, కె.వి.పల్లె, పెనుమూరు, పుంగనూరుల్లో 8చొప్పున, బి.ఎన్‌.కండ్రిగ, విజయపురం 7 వంతున, కె.వి.బి.పురం, కురబలకోట, తొట్టంబేడుల్లో ఆరుగురు చొప్పున, గంగవరం, కలకడ, పూతలపట్టు, శాంతిపురం, తంబళ్లపల్లె, వాల్మీకిపురంలో 5 వంతున, బి.కొత్తకోట, బంగారుపాళెం, సత్యవేడు, సోమల, వి.కోటలో 4 చొప్పున, బైరెడ్డిపల్లె, గుడిపాల, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, పిచ్చాటూరు, వెదురుకుప్పం, ఎర్రావారిపాలెంలో మూడు చొప్పున, ఐరాల, యాదమర్రిలో రెండు వంతున, జీడీనెల్లూరు, నారాయణవనం, సదుం, శ్రీరంగరాజపురం, తవణంపల్లె, వరదయ్యపాళెంలో ఒక్కొక్కరికి వైరస్‌ సోకింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని