Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిహారం తీసుకొని.. ఇదేం పని

చంద్రగిరి గ్రామీణ: పూతలపుట్టు - నాయుడుపేట జాతీయ రహదారికి కేటాయించిన స్థలాన్ని స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యక్తి దర్జాగా కబ్జా చేశాడు. చంద్రగిరి మండలం దిగువ కాశిపెంట్లకు చెందిన కె.మునిశేఖర్‌నాయుడు నష్ట పరిహారం తీసుకుని జాతీయ రహదారి విస్తరణకు అప్పగించిన స్థలంలో అక్రమంగా నిర్మాణ పనులు చేస్తున్నాడు. పరిహారం చెల్లించిన స్థలంలో అడ్డగోలుగా నిర్మాణం చేస్తున్నప్పటికీ రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సుమారు రూ.40 లక్షలు పరిహారం చెల్లించిన స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసి అడ్డగోలుగా నిర్మాణం చేస్తున్నప్పటికీ రహదారి విస్తరణ పనులు చేస్తున్న గుత్తేదారు అడ్డుచెప్పక పోవటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని