Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చదునైన బండ.. చల్లని కుండ

బోయకొండపై ఉన్న చరిత్రాత్మక విశేషాల్లో ఒకటి రాతిగుండు కింద కొలను. అమ్మవారి ఆలయం నుంచి పైకి రెండు కిలో మీటర్ల దూరం ఎత్తులో ఉన్న ఈ కొలను చదునైన బండ మధ్యలో లోత్తైన బావిని తలపిస్తోంది. ఇది ఉత్తర, దక్షిణ అంచులను తాకుతూ బోర్లించినట్టు పెద్దరాతిగుండు ఉంది. ఈ మధ్యలోని కొలనులో ఏ కాలంలోనూ నీళ్లు తగ్గలేదు. మండుటెండలోనూ ఇక్కడ నీటిని తాకితే జిల్లుమనిపించడం విశేషం. ఆలయ అధికారులు ముళ్లపొదలతో కూడిన దారిని బాగుచేస్తే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న కొలనును అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సందర్శించడానికి వీలుకలుగుతుంది. -న్యూస్‌టుడే, చౌడేపల్లె


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని