1,000 దాటినకరోనా మరణాలు
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1,000 దాటినకరోనా మరణాలు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1,756 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఇదే సమయంలో మహమ్మారి సోకి ఆరుగురు మరణించారు. వీటితో కలిపి మరణాల సంఖ్య 1,004కు చేరుకుంది. పాజిటివ్‌ కేసుల వివరాలు ఇలా.. తిరుపతి నగరం 247, తిరుపతి గ్రామీణ 143, మదనపల్లె 95, చిత్తూరు నగరం 69, పుంగనూరు 65, బంగారుపాళ్యం 62, చంద్రగిరి 61, ఏర్పేడు 45, పలమనేరు 42, కుప్పం 41, పీలేరు 38, ఎర్రావారిపాళెం 37, శాంతిపురం 34, వాల్మీకిపురం, రామకుప్పంలో 33 చొప్పున, పుత్తూరు, తంబళ్లపల్లె, గంగవరంలో 32 చొప్పున, రేణిగుంట, కంభంవారిపల్లెలో 31 వంతున, బైరెడ్డిపల్లె 30, తవణంపల్లె 27, పెద్దపంజాణి 26, ములకలచెరువు 25, కార్వేటినగరం, రొంపిచెర్ల, శ్రీకాళహస్తిలో 24 చొప్పున, చిన్నగొట్టిగల్లు, కలికిరిలో 23 వంతున, నగరి, పాకాల, పులిచెర్లలో 20 చొప్పున, వెదురుకుప్పం 18, పెద్దతిప్పసముద్రం 17, సోమల, ఎస్‌ఆర్‌పురంలో 16 చొప్పున, గంగాధరనెల్లూరు, గుడుపల్లెలో 15 చొప్పున, కలకడ, సదుంలో 14 వంతున, బి.కొత్తకోట, వడమాలపేటలో 12 చొప్పున, బుచ్చినాయుడుకండ్రిగ, వి.కోటలో 10 చొప్పున, సత్యవేడు తొమ్మిది, గుడిపాల, పాలసముద్రంలో ఎనిమిది చొప్పున, రామచంద్రాపురం, రామసముద్ర, తొట్టంబేడులో ఏడేసి, గుర్రంకొండ, పెద్దమండ్యం, పూతలపట్టులో ఆరు చొప్పున, నాగలాపురం, పిచ్చాటూరులో అయిదేసి, ఐరాల, కురబలకోటలో నాలుగు చొప్పున, కేవీబీపురం, నిమ్మనపల్లె, విజయపురంలో మూడేసి, చౌడేపల్లె, పెనుమూరులో రెండు చొప్పున, నారాయణవనం, వరదయ్యపాళెం, యాదమరిలో ఒక్కో కేసు వెలుగు చూసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని