రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరికీ దీక్షా ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా పాఠశాల విద్యాశాఖ ఈ నెల 7 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు సమగ్రశిక్ష ఎస్పీడీ వెంట్రిసెల్వి ఉత్తర్వులు విడుదల చేశారు. మూడు విడతల్లో నూతన పాఠ్యాంశాలపై, చదవడం మాకిష్టం, దీక్ష కంటెంట్‌ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి బోధించే ఉపాధ్యాయులందరూ వారి చరవాణిలో దీక్షా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రతి రోజు శిక్షణలో హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు, మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని