అమ్మవారి ఆలయ దర్శన వేళలు కుదింపు
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మవారి ఆలయ దర్శన వేళలు కుదింపు

శ్రీపద్మావతీ అమ్మవారు

 

తిరుచానూరు, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయ దర్శన వేళల సమయాన్ని కుదిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను ఇకపై ఏకాంతంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో సాయంత్రం వేళలో అమలు చేస్తున్న వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయాన్ని ఉదయం 6 గంటలకు తెరిచి సుప్రభాత సేవ నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సహస్రనామార్చన, నిత్యార్చన, శుద్ధి, మొదటి గంట, ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు సర్వదర్శనం, 11.30 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు శుద్ధి, రెండవ గంట, 12.45 గంటలకు ఆలయం తలుపులు మూసివేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని తెరిచి ఆరు గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 6 గంటల నుంచి 7 గంటల వరకు శుద్ధి, రాత్రి గంట తదితర పూజలు చేయనున్నారు. 7.15 గంటలకు జరిగే ఏకాంత సేవ తరువాత ఆలయాన్ని మూసివేయనున్నారు. ప్రతి శుక్రవారం రోజున మాత్రం ఉదయం 4.30 గంటల వరకు ఆలయాన్ని తెరిచి రాత్రి 7.15 గంటలకు తలుపులు మూసివేస్తారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని