అత్యవసరమైతేనేబయటకు రండి: ఎస్పీ
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యవసరమైతేనేబయటకు రండి: ఎస్పీ


వాహనదారుడి గుర్తింపు కార్డును పరిశీలిస్తున్న ఎస్పీ వెంకట అప్పలనాయుడు

 

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: కొవిడ్‌ నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలను తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు మరింత కఠినతరం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అనవసరంగా రోడ్డుపైకి వచ్చేవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను నుంచి పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం తిరుపతి నగరంలోని పలు కూడళ్లలో తనిఖీలు నిర్వహించారు. పలువురు వాహనదారులను ఆపి వివరాలు ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులు కర్ఫ్యూ అమలుకు రోడ్డెక్కి.. అనవసరంగా రోడ్డుపైకి వచ్చేవారికి అడ్డుకట్టు వేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వచ్చినా తప్పక భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం చేయాలని కోరారు. ఆస్పత్రులు, మందుల దుకాణాలకు వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. శ్రీవారి భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం రానివ్వబోమని.. దర్శన టిక్కెట్లు చూపించి ఘాట్‌రోడ్డులోకి ప్రవేశించవచ్చని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని