పీలేరు డిగ్రీ కళాశాలకుఐఎస్‌ఓ ధ్రువప్రతం
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీలేరు డిగ్రీ కళాశాలకుఐఎస్‌ఓ ధ్రువప్రతం


ఉపకులపతి ఆచార్య రాజారెడ్డి చేతుల మీదుగా ఐఎస్‌ఓ ధ్రువపత్రం అందుకుంటున్న

ప్రిన్సిపాల్‌ శ్రీరాములు (కోటు వేసుకున్న వ్యక్తి)

పీలేరు: స్థానిక సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) ధ్రువపత్రం వరించింది. కళాశాల పరిపాలన, విద్య, సాంకేతిక, పరిశోధన, సామాజిక బాధ్యత, తదితర అంశాల్లో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నందుకుగాను ఐఎస్‌ఓ సంస్థ కళాశాలకు ఈ ధ్రువపత్రాన్ని అందించింది. బుధవారం తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పీలేరు కళాశాల ప్రిన్సిపాల్‌ సి.శ్రీరాములుకు ఎస్వీ ఉపకులపతి రాజారెడ్డి ధ్రువపత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. దీంతో విద్యార్థులకు ఉద్యోగ, విద్యా అవకాశాలు మెరుగుపడతాయని, కళాశాలను అత్యున్నత ప్రమాణాలతో నడిపేందుకు దోహదపడుతుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని