ట్రయేజ్‌ కేంద్రాల బలోపేతం
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రయేజ్‌ కేంద్రాల బలోపేతం


మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ

 

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: కొవిడ్‌ మాహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ట్రయేజ్‌ కేంద్రాలను బలోపేతం చేసి వైరస్‌ తీవ్రతను గుర్తించి వైద్య సేవలను అందిస్తూ కరోనా వ్యాప్తిని అరికడుతున్నామని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారిణి సరళమ్మ తెలిపారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ‘జిల్లాలో వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేసినా అన్నీ నిండిపోతున్నాయి. వైరస్‌ తీవ్రత లేనివారు కూడా ఆస్పత్రులు, కొవిడ్‌ వార్డుల్లో చికిత్స పొందుతుండడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి సేవలు అందడం ఆలస్యమవుతోంది. వాటి కోసం ఇప్పటికే వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని చిత్తూరు, మదనపల్లె జిల్లా ఆస్పత్రులతో పాటు శ్రీకాళహస్తి, నగరి, పీలేరు, కుప్పం, పలమనేరు ఏరియా ఆస్పత్రుల్లో ట్రయేజ్‌ కేంద్రాల ద్వారా వైరస్‌ బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరం ఉన్న వారిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చి సేవలు అందిస్తున్నాం. జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌ ఆదేశాలతో సామాజిక ఆరోగ్య కేంద్రాలైన పుంగనూరు, సత్యవేడు, పుత్తూరు, చంద్రగిరిలోనూ ట్రయేజ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలను బలోపేతం చేస్తున్నాం. వైరస్‌ స్థాయి తీవ్రంగా ఉంటే స్థానికంగా గుర్తించిన ఆస్పత్రిలో చేరుస్తారు. ప్రభావం తక్కువగా ఉన్న వారిని కొవిడ్‌ వార్డులో, లక్షణాలు కనిపించకపోయినా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను హోమ్‌ ఐసోలేషన్‌కు తరలించి నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని 22 ఆస్పత్రుల్లోని 11 ఆస్పత్రుల్లో ట్రయేజ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తుండగా త్వరలోనే మిగిలిన వాటిలో కూడా ట్రయేజ్‌ కేంద్రాల ద్వారా బాధితులకు సేవలు అందించనున్నామ’ని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని