కర్ఫ్యూ ఆంక్షలు అతిక్రమిస్తే కేసులు
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ఫ్యూ ఆంక్షలు అతిక్రమిస్తే కేసులు

 

ఎస్పీ సెంథిల్‌కుమార్‌

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: ‘జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలు విధించింది. అందరూ వాటిని తప్పకుండా పాటించాలి. నిబంధనలను అతిక్రమిస్తే.. కేసులు తప్పవ’ని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆంక్షలు మొదలయ్యాయని, ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోగా మాత్రమే వ్యాపార సంస్థలు, వాహన రాకపోకలు సాగాలని చెప్పారు. నిత్యావసర వాహనాలు, గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు, అంబులెన్సులు, ఔషధ అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఇతర ఏ వాహనాలు కనిపించినా చర్యలు తప్పవన్నారు. సరదా కోసం ఎవరైనా రోడ్డుపై కనిపించినా, వాహనాల్లో తిరుగుతూ పట్టుబడినా కేసులు తప్పవని హెచ్చరించారు. చిల్లర దుకాణాలు, బేకరీలు, ఫ్యాన్సీ, ఇతర దుకాణాలు తెరిచినట్లు తెలిసినా, ఫిర్యాదులు అందినా కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. బుధవారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా నిబంధనలను అతిక్రమించిన వాహనదారులపై 3 వేల కేసులు, 12 గంటలకు పైన దుకాణాలు తెరిచిన వారిపై 50 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఇక నుంచి మరింత కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయనున్నామని, ప్రజలందరూ నిబంధనలను పాటించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని