అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు బలోపేతం చేయండి: డీఎస్పీ
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు బలోపేతం చేయండి: డీఎస్పీ


సీఐలతో మాట్లాడుతున్న డీఎస్పీ రవిమనోహరాచారి

 

మదనపల్లె నేరవార్తలు: మదనపల్లె డివిజన్‌లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను బలోపేతం చేసి కట్టుదిట్టంగా బందోబస్తు నిర్వహించాలని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి అన్నారు. బుధవారం ఆయన మదనపల్లె రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. డివిజన్‌లో 6 అంతర్రాష్ట్ర, జిల్లా చెక్‌పోస్టులు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఎస్‌ఈబీ వారు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసు సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే అంతర్రాష్ట తనిఖీ కేంద్రాలు తెరిచి ఉంటాయని తర్వాత పూర్తిగా మూసివేస్తామన్నారు. అత్యవసర సేవలు, కూరగాయలు, సరుకులు తప్ప మరే వాహనాలను అనుమతించేది లేదని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రులకు వెళ్లే వారికి అత్యవసర సేవలు నిర్వహిస్తున్న వారికి మాత్రమే మినహాయింపు ఉందన్నారు. అన్ని కూడళ్లలో పోలీసు తనిఖీలు ఉంటాయన్నారు. రెండో విడత కరోనా వ్యాపించినప్పటి నుంచి మదనపల్లె సబ్‌డివిజన్‌లో 60 మంది పోలీసు సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారని, వీరిలో 30 మంది కోలుకుని విధులకు వచ్చారన్నారు. ప్రస్తుతం 30 మంది మాత్రమే చికిత్సలు పొందుతున్నారన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో మాస్కులు, ఫేస్‌ షీల్డులు, చేతులకు గ్లౌజులు ధరించడంతో పాటు శానిటైజర్లు వినియోగిస్తూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీనివాసులు, ఈదురుబాషా, ఎస్సై దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని