తిరుపతిలోనే  అత్యధిక కేసులు
logo
Updated : 18/06/2021 05:27 IST

తిరుపతిలోనే  అత్యధిక కేసులు

ఈనాడు-తిరుపతి: జిల్లాలో తిరుపతిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. సదుం మండలంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 937 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయింది. జిల్లాలో 12 మంది కొవిడ్‌తో చనిపోయారు. తిరుపతి నగరం 80, చిత్తూరు, పుత్తూరు నగరాలలో 29 చొప్పున, మదనపల్లె పట్టణం 20, శ్రీకాళహస్తి పట్టణం 11, పలమనేరు 9, పుంగనూరు పట్టణం 6, నగరి పట్టణంలో 2 కేసులు నమోదయ్యాయి. ఐరాల 43, పూతలపట్టు 38, తిరుపతి గ్రామీణ 31, గంగవరం 28, గంగాధర నెల్లూరు 27, బంగారుపాళ్యం 26, పుత్తూరు గ్రామీణ, తవణంపల్లెల్లో 24 కేసులు చొప్పున వెలుగు చూశాయి.

నారాయణవనం 23, పలమనేరు గ్రామీణ 22, ములకలచెరువు, పీలేరులో 21 చొప్పున, రేణిగుంట 19, కుప్పం 18, పాలసముద్రం 17, శాంతిపురం 16, పాకాల, వరదయ్యపాళెంలో 15 వంతున, కేవీపల్లె, ఎస్‌ఆర్‌పురంలో 14 చొప్పున, మదనపల్లె గ్రామీణ, పీటీఎం, రామకుప్పం, వాల్మీకిపురంలో 13 చొప్పున, బి.కొత్తకోట, గుర్రంకొండల్లో 12 వంతున కేసులు నమోదయ్యాయి. నాగలాపురం, వి.కోట, ఏర్పేడుల్లో 11 చొప్పున, చంద్రగిరి, చిత్తూరు గ్రామీణ, కురబలకోట, తొట్టంబేడు, ఎర్రావారిపాలెంలో 10 వంతున, యాదమరి 9, చిన్నగొట్టిగలు, కేవీబీపురంలో 8 మంది చొప్పున వైరస్‌ బారినపడ్డారు. బైరెడ్డిపల్లె, బీఎన్‌కండ్రిగ, కలికిరి, పెద్దమండ్యం, సత్యవేడు, వెదురుకుప్పంలో 7 వంతున, కలకడ, కార్వేటినగరం, పెనుమూరులో 6 చొప్పున, పులిచెర్ల, సోమల, శ్రీకాళహస్తి గ్రామీణంలో ఐదేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. తంబళ్లపల్లె, వడమాలపేటల్లో 4 వంతున, నగరి గ్రామీణ, పిచ్చాటూరు, పుంగనూరు గ్రామీణ, రామచంద్రాపురం, విజయపురంలో 3 చొప్పున, గుడిపాల, నిండ్ర, పెద్దపంజాణి, రామసముద్రం, రొంపిచెర్లలో 2 వంతున, చౌడేపల్లె, గుడిపల్లె, నిమ్మనపల్లెల్లో ఒక్కో కేసు వెలుగు చూశాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని