ప్రత్యేక దళాలతో శాంతిభద్రతల పరిరక్షణ
logo
Published : 18/06/2021 04:21 IST

ప్రత్యేక దళాలతో శాంతిభద్రతల పరిరక్షణ

రక్షక్‌, బ్లూకోల్ట్స్‌కు సూచనలు చేస్తున్న అర్బన్‌ ఎస్పీ

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: అసాంఘిక కార్యక్రమాల కట్టడికి ప్రత్యేక దళాలు నిరంతరం పర్యవేక్షించాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. 60 మంది పోలీసులతో రక్షక్‌, బ్లూకోల్ట్స్‌ బృందాలను ఏర్పాటు చేసి.. వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక పరేడ్‌ మైదానంలో గురువారం జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపామన్నారు. పది రక్షక్‌, 12 బ్లూకోల్ట్స్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రతి రక్షక్‌ వాహనంలో హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే కొన్ని నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలని వారికి సూచించారు. రక్షక్‌ దృష్టికి రకరకాల సమస్యలు, క్లిష్టమైన పరిస్థితులు వస్తుంటాయి.. వాటిని స్టేషన్‌ వరకు రానీయకుండా మీరే(రక్షక్‌ సిబ్బంది) పరిష్కరించాలని చెప్పారు. ప్రతి విషయాన్ని కమాండ్‌ కంట్రోల్‌కు తెలియజేసి వారి ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలపై నిఘా పెట్టి.. యువతలో చైతన్యం తీసుకొచ్చేలా చూడాలన్నారు. రౌడీలు, కేడీల వివరాలు తెలుసుకుని వారి కదలికలపై పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు.అదనపు ఎస్పీలు సుప్రజ, మునిరామయ్య, ఆరిపుల్లా, డీఎస్పీలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని