ప్రాణమున్నంత వరకు సేవ : రోజా
logo
Updated : 18/06/2021 05:30 IST

ప్రాణమున్నంత వరకు సేవ : రోజా

నగరి, న్యూస్‌టుడే: నన్ను ఆదరించిన నగరి నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణమున్నంత వరకు సేవ చేస్తుంటానని నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా పేర్కొన్నారు. కొన్ని నెలలుగా కిందట ఆమె వ్యక్తిగత చికిత్స చేయించుకొన్నారు. చెన్నైలో విశ్రాంతి తీసుకొని గురువారం నగరికి వచ్చారు. పలు ప్రభుత్వ పథకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకున్నా.. నేను అక్కడ ఉన్నా నా మనస్సు ఇక్కడే ఉందన్నారు. 2004లో తెదేపా అభ్యర్థిగా నగరికి వచ్చానని, నాడు ఓటమిని చవిచూసినా 2014లో నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించి మీ ఆడపడుచుగా గౌరవించారన్నారు. 2019లో విజయం అందించి రాజకీయంగా నన్ను మీ మధ్యే జీవించే ఆవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాడనికి ప్రభుత్వ పరంగా పథకాలు వర్తింపచేయించడంతో పాటు నా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తానని తెలిపారు. అనంతరం నగరి దేశమ్మ ఆలయంలో రూ.4 లక్షలతో నూతనంగా నిర్మించిన కల్యాణకట్టను, రూ.4 లక్షలతో పునఃనిర్మించిన నాగాలమ్మ గుడిని ప్రారంభించారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని