రుయాకు వైద్య సామగ్రి వితరణ
logo
Published : 18/06/2021 04:21 IST

రుయాకు వైద్య సామగ్రి వితరణ


వైద్య వస్తువులు అందజేస్తున్న నగర పాలక కమిషనర్‌ తదితరులు

తిరుపతి(వైద్యవిభాగం): రుయా ప్రభుత్వ ఆస్పత్రికి వైకాపా నేత కొల్లు రఘురామిరెడ్డి రూ.2 లక్షల విలువైన వైద్య సామగ్రిని వితరణ చేశారు. నగర మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ, కార్పొరేటర్‌ భూమన అభినయ్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతికి అందజేశారు. వారు మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన సేవలందిస్తున్న రుయా అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఏఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ, డాక్టర్‌ సాధన, వర్కింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్‌ రాయల్‌, కార్పొరేటర్లు ఆర్‌.వెంకటేష్‌, గణేష్‌ పాల్గొన్నారు.

అభినయ్‌ దృష్టికి స్టాఫ్‌ నర్సు సమస్య: రెమ్‌డెసివర్‌ మందు విషయమై స్టాఫ్‌ నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. సర్వీసు రిజిస్టర్‌లో నమోదుకు రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని స్టాఫ్‌ నర్సుల అసోసియేషన్‌ వైకాపా యువనేత భూమన అభినయ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. బాధితులతో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అభినయ్‌ రుయా సూపరింటెండెంట్‌ను కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని