పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారు..?
logo
Published : 18/06/2021 04:21 IST

పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారు..?


ఆందోళనకారులతో మాట్లాడుతున్న తహసీల్దారు చిన్నవెంకటేశ్వర్లు

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: పూతలపుట్టు-నాయుడుపేట జాతీయరహదారి విస్తరణకు భూములు తీసుకుని పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడంపై ఓ రైతు కుంటుంబం రోడ్డెక్కింది. బాధితురాలి కథనం మేరకు.. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లికి చెందిన చిట్టెమ్మకు గతంలో కొంత భూమి కేటాయిస్తూ ప్రభుత్వం లీజు పట్టా ఇచ్చింది. రోడ్డు పనులకు ఈ భూమిని తీసుకున్నారు. నష్ట పరిహారం చెల్లించలేదు. అలాగే విస్తరణ పనుల్లో భాగంగా సువర్ణముఖి నదిని కొంతమేర పూడ్చి వరదనీటిని ఆమె పట్టాభూమిపై మళ్లించారు. దీంతో గురువారం బాధితురాలు తన కుటుంబీకులతో కలసి విస్తరణ పనులు అడ్డుకుని రోడ్డుపై ఆందోళనకు దిగారు. పనులు చేస్తున్న సిబ్బంది రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారంటూ తెదేపా మండలాధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యంనాయుడు, గ్రామస్థులు ఆమెకు మద్ధతుగా నిలిచారు. సమాచారం అందుకున్న తహసీల్దారు చిన్న వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. మహిళా రైతు కోరిక మేరకు పట్టాభూమికి ఆనుకుని అడ్డుగోడ కట్టిన తర్వాత పనులు చేపట్టాలని అక్కడి ఇంజినీర్లకు సూచించారు. అలాగే బాధితురాలికి త్వరలో నష్టపరిహారం వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని