పీటీసీ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే చెవిరెడ్డి
logo
Published : 18/06/2021 04:21 IST

పీటీసీ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే చెవిరెడ్డి


మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చంద్రగిరి గ్రామీణ: ఎ.రంగంపేట సమీపంలోని కల్యాణీ పోలీస్‌ శిక్షణ కళాశాల అభివృద్ధికి కృషిచేస్తానని చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కళాశాలలో గురువారం ఆనందయ్య మందు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాలలోని లలితకళా వేదికను సెంట్రల్‌ ఏసీతో ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి శిక్షణకు వచ్చే పోలీసు కుటుంబసభ్యుల కోసం విశ్రాంతి గదులు నిర్మిస్తామన్నారు. కళాశాల ఆవరణలో సోలార్‌ విద్యుత్తు దీపాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. పది రకాల పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేయిస్తానని, ప్రాంగణంలో అందరూ మొక్కలు నాటించే పనులు చేయాలన్నారు. రెండు, మూడు రోజుల్లో తుడా ఇంజనీర్లు వచ్చి అంచనాలను రూపొందిస్తారని వెల్లడించారు. పీటీసీ ప్రిన్సిపల్‌ అశోక్‌బాబు, వైస్‌ ప్రిన్సిపల్‌ మునిరాజ, తహసీల్దారు చిన్న వెంకటేశ్వర్లు, ఎంపీడీవో రాధమ్మ, ఎ.రంగంపేట సర్పంచి ఎర్రయ, వైకాపా నేతలు హేమేంద్రకుమార్‌ రెడ్డి, బోసురెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి(గ్రామీణ): పేరూరు పంచాయతీ పరిధిలోని ఏజీ స్టాఫ్‌క్వార్టర్స్‌లోని బోధన, బోధనేతర ఉద్యోగులకు గురువారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ కూడా వేయించుకోవాలని కోరారు. సర్పంచి డి.కేశవులు, వైకాపా నాయకులు పరంధామరెడ్డి, చెంచుమోహన్‌, జాన్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని