బాధితులను ఆదుకోవాలి
logo
Published : 18/06/2021 04:21 IST

బాధితులను ఆదుకోవాలి

తిరుపతి(రెవెన్యూ): కరోనాతో చనిపోయినట్లు నమోదు చేసిన ధ్రువీకరణ పత్రాలనే బాధిత కుటుంబాలకు అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా మరణాలకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వైరస్‌తో కుటుంబ పెద్దలు చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనాతో మృతిచెందిన వారికి.. మృతికి కారణాలు లేకుండా ధ్రువపత్రాలు అందజేస్తే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో కనకనరసారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. నాయకులు పెంచలయ్య, మురళి, నదియా, రాధాకృష్ణ, రాజా, రామకృష్ణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని