గృహ నిర్మాణ లక్ష్యాలు అధిగమించాలి
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

గృహ నిర్మాణ లక్ష్యాలు అధిగమించాలి


మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గ్రౌండింగ్‌ పూర్తయిన గృహ నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. నగరి, చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, శ్రీకాళహస్తి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లోని మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నియోజకవర్గాల్లో 1,01,876 ఇళ్లకుగానూ 61,186 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయని, పునాది స్థాయి నిర్మాణాల లక్ష్యాల్ని నిర్ణీత గడువు లోపు పూర్తిచేయాల న్నారు. కొన్ని మండలాల్లో పురోగతి తక్కువగా ఉందని, సమస్యలను హౌసింగ్‌ జేసీ దృష్టికి తీసుకురావాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులు వెంటనే కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్‌ జేసీ వెంకటేశ్వర, హౌసింగ్‌ పీడీ పద్మనాభం పాల్గొన్నారు.

భవన నిర్మాణాలు పూర్తిచేయాలి: గ్రామస్వరాజ్య సాధన నిమిత్తం గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తోన్న భవన నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్‌ హరి నారాయణన్‌ ఆదేశించారు. మదనపల్లె డివిజన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మదనపల్లె డివిజన్‌కు 299 సచివాలయాలు మంజూరుకాగా 131 పూర్తయ్యాయన్నారు. 270 రైతు భరోసా కేంద్రాల్లో 65 పూర్తయ్యా యని, 199 వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లకు గాను 51 పూర్తయ్యాయన్నారు. జేసీ వీరబ్రహ్మం, పీఆర్‌ ఎస్‌ఈ అమరనాథరెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని