జాతీయ విద్యావిధానానికి సహకరించండి
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

జాతీయ విద్యావిధానానికి సహకరించండి


ఉపాధ్యాయ సంఘ నాయకులతో మాట్లాడుతున్న డీఈవో పురుషోత్తం

చిత్తూరు విద్య: ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ నూతన విద్యా విధానానికి అందరూ సహకరించాలని డీఈవో పురుషోత్తం కోరారు. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈవో సమావేశమై జాతీయ విద్యావిధానంపై చర్చించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ అభిప్రా యాలను తెలియజేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాల నుంచి మూడు, నాలుగు, ఐదు తరగతులను వేరుచేసి మూడు కిమీ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం తగదని ఆయా సంఘాల నాయకులు ఆయనకు చెప్పారు. తద్వారా విద్యార్థులు బడిమానేసే ప్రమాదం ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లోనే ఐదో తరగతి వరకు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, తెలుగు, ఆంగ్ల మాధ్యమానికి వేర్వేరుగా ఉపాధ్యాయులను నియమించాలని సంఘ నాయకులు విన్నవించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని