మద్యం మత్తులో భార్యను..
eenadu telugu news
Updated : 01/08/2021 05:32 IST

మద్యం మత్తులో భార్యను..


రమణమ్మ (పాతచిత్రం)

పలమనేరు, న్యూస్‌టుడే: మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన రెండో భార్యను మద్యం మత్తులో హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన పలమనేరులో పట్టణంలోని ఆదిఆంధ్రా వీధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పలమనేరు పోలీసుల కథనం ప్రకారం.. కమలనాథ్‌ రమణమ్మ(40)ను 20 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. ఆమెకు గతంలోనే మరొకరితో వివాహమైంది. భర్తను వదిలేసి కమలనాథ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని అతడు తరచూ అనుమానించేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. చివరకు మత్తులో ఆమెను కర్రతో బలంగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సీఐ భాస్కర్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని