అమ్మా..రాణెమ్మ
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

అమ్మా..రాణెమ్మ

చిన్నగొట్టిగల్లు, న్యూస్‌టుడే :

కూతురు పల్లవికి భోజనం తినిపిస్తున్న రాణెమ్మ

గ్రామాల్లో పేద మహిళలు డ్వాక్రా గ్రూపుల ద్వారా రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలం అయ్యపశెట్టిగారిపల్లికి చెందిన రాణెమ్మ ఐదు సంవత్సరాల క్రితం వెలుగు సంఘాల ద్వారా సుమారుగా లక్ష రూపాయలు రుణంగా తీసుకున్నారు. చిన్నగొట్టిగల్లులోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో చిల్లరకొట్టు, టీ అంగడి నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా తల్లితో పాటు బిడ్డలను పోషించుకుంటున్నారు. రాణెమ్మకు ఒక కుమారుడు, దివ్యాంగురాలైన కూతురు ఉన్నారు. భర్త చెడు వ్యసనాలకు బానిసై వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఆమె తీసుకోవాల్సి వచ్చింది. మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. భర్త లేకపోయినా వెరవకుండా ధైర్యంగా అడుగేశారు. పొదుపు సంఘంలో చేరారు. ఒక్కో రూపాయి పోగేశారు. డ్వాక్రా సంఘం ద్వారా రుణం పొందారు. మొదట్లో టీ కొట్టు ప్రారంభించారు. ప్రస్తుతం చిల్లర కొట్టు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొడుకు పవన్‌ చిన్నగొట్టిగల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా, దివ్యాంగురాలైన కూతురు పల్లవి బాధ్యత మొత్తం ఆమె చూసుకుంటున్నారు. కూతురికి అన్నీ తానై సపర్యలు చేస్తూ కుటుంబాన్ని నడుపుతూ పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరితో పాటు తన తల్లి ఉండడంతో ఆమె బాధ్యత కూడా తీసుకుని పోషిస్తున్నారు.

రాధమ్మ సాయం మరువలేనిది

భర్త దూరమయ్యాక కుటుంబాన్ని, పిల్లలను పోషించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. చిన్నగొట్టిగల్లులోని మండల కార్యాలయాల దగ్గర చిన్న టీకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటుండగా.. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీీడీవో రాధమ్మ నా కష్టాలను చూసి రాయితీ రుణాన్ని మంజూరు చేశారు. చిల్లర కొట్టు పెట్టుకోవడానికి ఎంతో సాయం చేశారు. ఆమె వ్యక్తిగత చొరవ చూపడంతో నేను టీ కొట్టుతో పాటు, చిల్లర అంగడి నడుపుకుంటున్నాను.జీవనాన్ని సాగిస్తున్నాను. రాణెమ్మ, చిన్నగొట్టిగల్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని