నాట్య గణపతి విగ్రహం ఏర్పాటు చేయాలి
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

నాట్య గణపతి విగ్రహం ఏర్పాటు చేయాలి

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న

వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు

తిరుపతి(నగరపాలిక): వినాయకసాగర్‌ మధ్యలో 60 అడుగుల నాట్య గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, వినాయకచవితి నాటికి సాగర్‌ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్‌ సామంచి శ్రీనివాస్‌, సభ్యులు కమిషనర్‌ గిరీష, మేయర్‌ శిరీషను కోరారు. వినాయకసాగర్‌లో సామూహిక నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లపై శనివారం సభ్యులు మేయర్‌, కమిషనర్‌తో సమావేశమై చర్చించారు. సామూహిక నిమజ్జనానికి చర్యలు చేపట్ట్టాలని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు విన్నవించారు. సాగర్‌లో పనులు వేగవంతం చేయాలని, ఈ ఏడాది మురుగునీటిలో కాకుండా మంచినీటిలో నిమజ్జనం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, గుండాల గోపినాథ్‌, నవీన్‌, శరత్‌కుమార్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని