అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్టు
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్టు

తిరుపతి(నేరవిభాగం): అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠాను తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న 40 వాహనాలు, ఐదుగురు నిందితులను శనివారం స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారి వివరాలను అదనపు ఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహన చోరీ కేసులపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పాత నేరస్తులు, ఇటీవల జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా సారించామన్నారు. జులై 30వ తేదీన తనపల్లి మార్కెట్‌ యార్డ్‌ సర్కిల్‌, పూడి క్రాస్‌ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కొందరి కదలికలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో జీవ (19), చిట్టిబాబు (21), సునీల్‌కుమార్‌ (20), మరో ఇద్దరు మైనర్లుగా (17) గుర్తించామన్నారు. కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని